ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు కేఎస్ సూర్యనారాయణ, ఆస్కార్రావులు సోమవారం అమరావతి సచివాలయంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కేఎస్ జవహర్‌రెడ్డితో భేటీ అయ్యారు. ఉద్యోగుల సమస్యలు వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేశారు. మొత్తం 26 డిమాడ్లతో కూడిన వినతిపత్రాన్ని అందజేశారు. ఈ సమస్యలను వెంటనే పరిష్కరించాలని సీఎ్‌సను కోరారు. ఈ డిమాండ్లను వెంటనే ఆయా శాఖలకు పంపి పరిష్కరిస్తామని సీఎస్ హామీ ఇచ్చినట్లు వీరు తెలియజేసారు.