రేషన్‌కార్డుల పంపిణీపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. వలసదారులకు రేషన్ లభించకపోవటంపై వేసిన పిటీషన్‌ను విచారించిన కోర్టు, సంక్షేమ పథకాలు పౌరులందరికీ అందాలని పేర్కొంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వలసదారులకు రేషన్‌కార్డులను నిరాకలించలేవని స్పష్టం చేసింది. వారికి సంక్షేమ పథకాలు అందేలా చేసే బాధ్యత కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలదే అని, దీనిపై దృష్టి సారించాలని ఆదేశించింది.