కాంట్రాక్ట్ ఉద్యోగులకు ఏపీ ప్రభుత్వం గుడ్న్యూస్ చెప్పింది. కాంట్రాక్ట్ ఉద్యోగుల పదవి కాలాన్ని మరో ఏడాది పాటు పొడిగిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు సోమవారం ఆర్థికశాఖ ముఖ్య కార్యదర్శి చిరంజీవి ఉత్తర్వులు జారీ చేశారు. కాంట్రాక్ట్ ఉద్యోగుల పదవీ కాలాన్ని ఏడాది లేదా ఆ పోస్టుల్లో శాశ్వత ఉద్యోగులను నియమించే వరకు ఏది ముందు అయితే అంత వరకు వీరి ఒప్పందం పొడిగించారు.