టీడీపీ పులివెందుల ఇన్‌చార్జి, మాజీ ఎమ్మెల్సీ బీటెక్ రవికి ప్రభుత్వం గన్‌మెన్లను తొలగించింది. మాజీ మంత్రి వైఎస్ వివేకా హత్య కేసు గురించి గట్టిగా మాట్లాడుతున్నందునే ప్రభుత్వం కక్ష గట్టి ఆయన గన్‌మెన్లను తొలగించిందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. 2006లో బీటెక్ రవి బాబాయి రామచంద్రారెడ్డిని ప్రత్యర్థులు అంతమొందించగా, అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి బీటెక్ రవికి 1 ప్లస్ 1 గన్‌మెన్‌లతో రక్షణ కల్పించారు. ఆ తర్వాత టీడీపీ హయంలో 2 ప్లస్ 2 గన్‌మెన్లతో భద్రత కల్పించారు. కాగా, జగన్ సీఎం అయిన ఆరు నెలలకే దాన్ని 1 ప్లస్ 1కు కుదించారు. తాజాగా గన్‌మెన్లను పూర్తిగా తొలగించారు. దీనిపై టీడీపీ అధినేత చంద్రబాబు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. కడప జిల్లాలో రాజకీయ పరిస్థితుల దృష్ట్యా భద్రతను పునరుద్ధరించాలని కోరుతూ డీజీపీకి లేఖ రాశారు.