ఏపీలోని నిడదవోలు జంక్షన్ సమీపంలో రైల్వే హైటెన్షన్ వైర్లు మంగళవారం తెగిపడ్డాయి. దీనిని సకాలంలో గుర్తించడంతో పెను ప్రమాదం తప్పింది. విద్యుత్ వైర్లు తెగిపడడంతో పలు రైళ్లు నిలిచిపోయాయి. రైళ్ల రాకపోకలు పునరుద్ధరించేందుకు మరికొంత సమయం పట్టే అవకాశం ఉంది. తెగిపోయిన విద్యుత్ లైన్లను రైల్వే అధికారులు సరి చేస్తున్నారు.