వివేకా హత్య కేసులో ఎంపీ అవినాష్ రెడ్డి బెయిల్ పిటిషన్‌పై నరసాపురం ఎంపీ రఘురామ కృష్ణంరాజు స్పందించారు. ఈ సందర్భంగా మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ... హైకోర్టులో సాక్షి కథనాలు నమ్ముతారా?.. సీబీఐని నమ్ముతారా? అని ప్రశ్నించారు. అవినాష్ రెడ్డిని పిలిస్తే పిలవండి కానీ అరెస్టు చేయొద్దని అంటారా?.. మధ్యంతరం బెయిల్ పిటిషన్‌పై న్యాయస్థానం స్టే ఇస్తుందా? లేదో చూడాలన్నారు. వివేకానందరెడ్డి హత్యపై గతంలో చంద్రబాబు హయాంలో ఒక సిట్ వేశారని.. జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత అభిషేక్ మహంతితో విచారణ చేయించారన్నారు. ఆయన విచారణ త్వరగా చేశారని, ఆయనను ట్రాన్స్‌ఫర్ చేశారన్నారు.