చేసిన పనికి రావలసిన పెండింగ్ బిల్లులు చెల్లించాలని డిమాండ్ చేస్తూ మంగళవారం విజయవాడలో ఇసుక కాంట్రాక్టర్లు ఆందోళనకు దిగారు. తాడిగడపలోని రాష్ట్ర ఖనిజాభివృద్ధి సంస్థ కార్యాలయం ఎదుట ధర్నా చేశారు. రోడ్డుపై బైఠాయించి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. గత రెండేళ్లుగా తమకు బిల్లులు ఇవ్వడంలేదని ఇసుక కాంట్రాక్టర్లు ఆవేదన వ్యక్తం చేశారు. మార్చి నెల 25లోపు బిల్లులు ఇస్తామని అధికారులు హామీ ఇచ్చారని.. అయితే బిల్లులు ఇవ్వకుండా తిప్పుతున్నారని కాంట్రాక్టర్లు ఆగ్రహం వ్యక్తం చేశారు.