పల్నాడు జిల్లా, వినుకొండలో అధికార పార్టీ నేతలు అరాచకానికి పాల్పడ్డారు. తిమ్మాయపాలెం రోడ్డులో శశిధరణి స్వీట్స్ తయారీ కేంద్రంతో పాటు మరో ఇల్లు కబ్దా చేశారు. వైసీపీ పట్టణ అధ్యక్షుడు ఖాన్ ఆధ్వర్యంలో వైసీపీ వర్గీయులు 150 మంది వరకు మూకుమ్మడి దాడి చేసి.. రెండు ఇళ్లను ద్వంసం చేశారు. స్దలం తమదే నంటూ దౌర్జన్యానికిదిగి.. బాధితులపై దాడి చేశారు. స్థానిక ఎమ్మెల్యే బొల్లా అండతోనే తమ ఇల్లు కబ్జా చేశారని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు.