తిరుపతి కలెక్టరేట్ వద్ద ఏపీజేఏసీ ఆధ్వర్యంలో ఉద్యోగులు మహాధర్నా చేపట్టారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర చైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వర్లు, వందలాదిమంది ప్రభుత్వ ఉద్యోగులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా బొప్పరాజు మాట్లాడుతూ... రాబోయే రోజుల్లో ఛలో విజయవాడ వంటి కార్యక్రమాలు చేపడతామన్నారు. ఉద్యోగ సంఘాలను ఇబ్బందులు పాలు చేసి దారికి తెచ్చుకోవాలని ప్రభుత్వం ప్రయత్నిస్తోందని విమర్శించారు. ఉద్యోగుల మధ్య ఐక్యత ఉందని.. ఉద్యోగ సంఘాల నేతలు కలిసి పోరాడాలని అనుకుంటున్నామన్నారు.