తెనాలి పట్టణ ఆర్యవైశ్య సంఘం అనుబంథ సంఘాలు ఎండ తీవ్రతతో దాహంతో ఇబ్బంది పడుతున్న బాటసారులకు, దాహార్తిని తీర్చి సమాజానికి చేస్తున్న సేవలు శ్లాఘనీయమని లీగల్ సెల్ ఛైర్మన్ దర్శికోటేశ్వరావు అన్నారు. మంగళవారం గంగానమ్మపేటలోని తిరుపతమ్మ గుడి వద్ద చలివేంద్రాన్ని ప్రారంభిస్తూ దాహార్తులకు పరిశుభ్రమైన పోషక విలువలు గలిగిన స్వఛ్ఛమైన నీటిని అందిస్తున్నారన్నారు. తెనాలి పట్టణ ఆర్యవైశ్య సంఘ అద్యక్షులు భాస్కరుని శ్రీనివాసరావు మాట్లాడుతు ఎవరైనా చలివేంద్రం పెట్టదలిస్తే వారికి కావలసిన కూలింగ్ మెషీన్లు వాటర్ క్యాన్లు తాము సమకూరుస్తామన్నారు. ఈ కార్యక్రమానికి ఆర్యవైశ్య సంఘాల కోఆర్డినేటర్ మద్దాలి శేషాచలం, వంకదారు శివ సుధాకర్, మాలేపాటి తిరుమలేశ్వర రావు, సి. వి, రమణ, వెచ్చ నాగరాజారావు, కొల్లా గురునాథ గుప్తా, కర్పూరపు రఘునాథ గుప్తా, చుండూరు శివప్రసాద్, కొండవీటి లక్ష్మీ పద్మావతి, నాగ సుధా, ఆర్యవైశ్య సంఘం నాయకులు ఆర్యవైశ్య ప్రముఖులు హాజరైనారు.