శ్రీకాకుళం 20వ డివిజన్ పరిధిలోని ఇలిసిపురంలో జగనన్నే మా భవిష్యత్తు, మా నమ్మకం నువ్వే జగన్ కార్యక్రమంలో యువనేత ధర్మాన రామ్ మనోహర్ నాయుడు పాల్గొని ఇంటింటా పర్యటించారు. ప్రతి ఇంటికి వెళ్లి వైయస్ జగన్ ప్రభుత్వం అందించిన సంక్షేమ పథకాలను వివరిస్తూ, మెగా పీపుల్స్ సర్వే బుక్లో వారి అభిప్రాయాలను నమోదు చేశారు. అనంతరం స్థానికుల అంగీకారంతో ఇంటి గోడలకు, తలుపులకు, సెల్ఫోన్లకు స్టిక్కర్లు అంటించి సెల్ఫీలు దిగారు. ఈ సందర్భంగా ధర్మాన రామ్ మనోహర్ నాయుడు మాట్లాడుతూ.. నాలుగేళ్ల కాలంలో కుల,మతాలకు అతీతంగా సంక్షేమ పథకాల అమలు చేస్తున్నామన్నారు. ఇవాళ ప్రజలంతా ఈ నాలుగేళ్ల కాలంలో ఆనందంగా ఉన్నారని తెలిపారు. శ్రీకాకుళం నియోజకవర్గంలో మంత్రి ధర్మాన ప్రసాదరావు చేస్తున్న సంక్షేమం, అభివృద్ధి అన్నవి ఏక కాలంలో చేయగలుగుతున్నారు. రోడ్డు వేస్తేనే అభివృద్ధి కాదు. రోడ్లూ వేయాలి, సంక్షేమమూ చేయాలన్నారు. నాడు - నేడు పేరిట నిర్వహిస్తున్న స్కూల్స్ ను చూడండి ఏవిధంగా అభివృద్ధి చెందాయో అన్నది మీకు తెలుస్తుంది అని తెలియజేసారు.