కర్ణాటకలో ప్రస్తుతం నామినేషన్ ల ప్రక్రియ కొనసాగుతోంది. అయితే, ఓ స్వతంత్య్ర అభ్యర్థి నామినేషన్ దాఖలు చేసేందుకు 10వేల రూపాయి నాణేలను తీసుకొని వచ్చి అధికారులకు షాకిచ్చాడు. స్వతంత్య్ర అభ్యర్థి యంకప్ప నామినేషన్ వేసేందుకు రూ. 10 వేలను రూపాయి నాణేల్లో డిపాజిట్ చేశాడు. దీంతో అధికారులు రెండు గంటలపాటు శ్రమించి డబ్బును లెక్కించారు. ఈ నాణేలను ప్రజల నుండి సేకరించినట్లు యంకప్ప తెలిపాడు.