మంగళగిరి మండలంలోని కాజా చినకాకాని పరిసర ప్రాంతాల్లో 19వ తేదీ బుధవారం విద్యుత్ సరఫరా లో ఆటంకం కలుగుతుందని మంగళగిరి విద్యుత్ శాఖ డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ అక్కల సత్యనారాయణ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. నూతన ట్రాన్స్ఫార్మర్ ఏర్పాటు నిమిత్తం ఈ ప్రాంతాల్లో ఉదయం 8 గంటల నుండి మధ్యాహ్నం 12: 30 గంటల వరకు విద్యుత్ సరఫరా లో ఆటంకం కలుగుతుందని కావున విద్యుత్ వినియోగదారులు సహకరించాలని ఆయన కోరారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa