దుండగుల దాడిలో గాయపడి చికిత్స పొందుతూ మృతి చెందిన రేపల్లె పట్టణ 14వ వార్డు టిడిపి కౌన్సిలర్ అన్నే రామకృష్ణ భౌతికకాయానికి బుధవారం రాజ్యసభ సభ్యులు మోపిదేవి వెంకట రమణారావు నివాళులర్పించారు. రామకృష్ణ కుటుంబ సభ్యులను పరామర్శించి సానుభూతి తెలిపారు. బాపట్ల అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్ దేవినేని మల్లికార్జున రావు, మున్సిపల్ చైర్ పర్సన్ కట్ట మంగ, మున్సిపల్ వైస్ చైర్మన్ లు గుజ్జర్లమూడి ప్రశాంత్ కుమార్, విశ్వనాధ్, గుప్తా వైసిపి నాయకులు రామకృష్ణ కు నివాళులర్పించారు.