సచివాలయాల సిబ్బంది నిత్యం ప్రజలకు అందుబాటులో ఉండాలని బాపట్ల జిల్లా జాయింట్ కలెక్టర్ సిహెచ్ శ్రీధర్ సూచించారు. రేపల్లె పట్టణంలోని 8, 10 వార్డుల సచివాలయ కేంద్రాన్ని మంగళవారం ఆయన ఆకస్మిక తనిఖీలు నిర్వహించి అనంతరం సిబ్బందికి పలు సూచనలిచ్చారు. సమస్యలపై వచ్చే ప్రజల నుంచి అర్జీలను స్వీకరించి పరిష్కరించాలని, తమ పరిధిలో లేనిఅంశాలను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్ళి పరిష్కరించి ప్రభుత్వ లక్ష్యాలను నెరవేర్చాలన్నారు. కార్యక్రమంలో తాసిల్దార్ మల్లికార్జునరావు, రెవెన్యూ సిబ్బంది పాల్గొన్నారు.