వ్యక్తి అదృశ్యంపై కేసు నమోదైంది. పోలీసుల కథనం ప్రకారం తెనాలి మండలం ఐతానగర్ చెందిన(57) ఏళ్ల మల్లపురం గోవిందు కూలీ పనులకు వెళుతుంటాడు. ఈనెల 10వ తేదీన రైల్వే స్టేషన్ ప్రాంతానికి వచ్చి కనబడకుండా వెళ్ళిపోయాడు. వెతికినా ఫలితం లేకపోవడంతో కుమారుడు ఆంజనేయులు మంగళవారం పోలీసులను ఆశ్రయించారు. త్రీ టౌన్ ఎస్ఐ ఎం. విజయకుమార్ కేసు నమోదు చేశారు.