రానున్న పార్లమెంటు సమావేశాల్లో ఎస్సీ వర్గీకరణ బిల్లు ప్రవేశపెట్టాలని, రాష్ట్ర ప్రభుత్వాన్ని ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ డిమాండ్ చేశారు. తిరుపతిలో నిర్వహించిన ఎమ్మార్పీఎస్ జాతీయ మహాసభల ముగింపు సభలో ఆయన మాట్లాడుతూ.. చట్టసభల్లో సామాజిక వాణి వినిపించేందుకు మహాజన సోషలిస్టు పార్టీ (ఎమ్మెస్పీ) రాజకీయ బరిలోకి దిగుతుందని స్పష్టం చేశారు.