నెల్లూరు జిల్లా ఉదయగిరి వైసీపీలో వర్గ విభేదాలు రోజురోజుకి పెరిగిపోతున్నాయి. ఫెక్సీల వివాదం ముదిరి జలదంకిలో మండల పార్టీ కన్నీనర్ జనార్ధన్ రెడ్డి ఏర్పాటు చేసిన ఫ్లెక్సీని మరో వర్గం తొలగించే ప్రయత్నం చేసింది. దీంతో ఫ్లెక్సీ వద్ద కుర్చీ వేసుకుని మరీ మహిళా నేత తిప్పారెడ్డి ఇందిరమ్మ కూర్చొని ఎవరొస్తారా రండి అంటూ సవాల్ విసురుతున్నారు. అయితే రాత్రికి రాత్రి ఆ ఫ్లెక్సీ ఎదుటనే మాజీ ఎమ్మెల్యే వంటేరు అనుచరులు మరో ఫ్లెక్సీ ఏర్పాటు చేశారు. దీంతో జలదంకిలో ఉద్రిక్తత చోటు చేసుకుంది.