వివేకా హత్య కేసుకు సంబంధించి ఢిల్లీ పైరవీలకు జగన్మోహన్ రెడ్డి తెరలేపారని మాజీమంత్రి దేవినేని ఉమ ఆరోపించారు. రాష్ట్రం దివాళా తీసిందని నిన్నటి సీఎస్ ప్రకటనతో రాష్ట్ర పరిస్థితి అర్ధమవుతోందని తెలిపారు. రాష్ట్ర విభజన ద్వారా ఏపీకి రావాల్సినవి ఏమీ తేకపోగా అవినాష్ రెడ్డిని కాపాడేందుకు ఢిల్లీ పర్యటనకు వంకలు వెదుక్కుంటున్నారని మండిపడ్డారు. రాజశేఖర్ రెడ్డి బతికి ఉంటే జగన్ వైఖరి చూసి నిజంగా చనిపోయేవాడన్నారు. చనిపోయిన వివేకా వ్యక్తిత్వాన్ని కించపరుస్తున్న జగన్మోహన్ రెడ్డి.. కోటలో కూర్చున్నా ఒక్కటే పేటలో కూర్చున్నా ఒక్కటే అని అన్నారు. ఏ మాత్రం నైతిక విలువలు ఉన్నా తక్షణమే ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయాలని దేవినేని ఉమా డిమాండ్ చేశారు.