మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్యలో వైసీపీ ఎంపీ అవినాష్ రెడ్డి, భాస్కర్ రెడ్డి, ఇతరులంతా పాత్రధారులు మాత్రమే అని.. సూత్రధారుడు మాత్రం జగన్మోహన్ రెడ్డే అని టీడీపీ ప్రధాన కార్యదర్శి బుద్దా వెంకన్న ఆరోపించారు. బుధవారం మీడియాతో మాట్లాడుతూ.. జగన్మోహన్ రెడ్డికి చెప్పే వివేకానంద రెడ్డిని హత్య చేశారన్నారు. సీబీఐ ఇంకా లోతుగా దర్యాప్తు చేస్తే అసలు కుట్రదారుడు జగన్మోహన్ రెడ్డేనని తేలిపోతుందని తెలిపారు. వివేకానంద రెడ్డిని చంపించి సానుభూతి ఓట్లు పొందవచ్చనే జగన్మోహన్ రెడ్డి ప్లాన్ సక్సస్ అయిందన్నారు.