ఈనెల 22వ తేదీ నుంచి మే 3 వరకూ వారణాసి లో గంగా పుష్కరాలు వున్నాయని, దాని సందర్భంగా రాష్ట్ర ప్రజలు ఇబ్బంది పడకూడదనే తలంపుతో రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్‌ను కలిసి మాట్లాడి ఈరోజు మధ్యాహ్నం 12-30 గంటలకు ప్రత్యేక రైలు విశాఖ నుంచి బయలు దేరి, గురువారం మధ్యాహ్నం 1 గంటకు దీన దయాళ్ ఉపాధ్యాయ స్టేషన్‌కు చేరుకునేలా ఏర్పాటు చేశామని బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు తెలియజేసారు. పుష్కరాల సందర్భంగా విశాఖ- కాశీ మధ్య రైలు 11 పర్యాయాలు నడుస్తుందన్నారు. ఇంటర్ రైల్వే జోనల్ సమస్యలను అదిగమించి రైలును సాధించుకున్నామన్నారు. వేసవి తర్వాత కూడా రెగ్యులర్‌గా నడిచేందుకు కృషి చేస్తామని జీవీఎల్ పేర్కొన్నారు.