విశాఖ స్టీల్ ఫ్యాక్టరీ ప్రైవేటీకరణ అంశంపై ఏఐసీసీ సభ్యుడు నరహరశెట్టి నరసింహారావు స్పందించారు. ఈ విషయానికి సంబంధించి నేడు విశాఖపట్నం లో రౌండ్ టేబుల్ సమావేశం జరుగుతున్న సందర్బంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.... రాజకీయ పార్టీలు, నేతలు ... లాలూచీ రాజకీయాలు చేస్తూ వ్యక్తిగత లాభం ఆశిస్తున్నారని.. ఢిల్లీలో శాసించే స్థాయి నుంచి.. అర్ధించే స్థాయికి దిగజారారని ఆరోపించారు. తమిళ ప్రజలకు ఉన్న కమిట్‌మెంట్ మనకు లేదని నరహరశెట్టి నరసింహారావు అన్నారు. విశాఖ స్టీల్ ఫ్యాక్టరీ విషయంలో కూడా కలిసి పోరాటం చేయకుంటే ఎలా? అని ప్రశ్నించారు. లాభాలు వచ్చే ఫ్యాక్టరీని ప్రైవేటు పరం చేసినా మౌనంగా ఉంటారా? అని ప్రశ్నించారు. ఏపీ నుంచి గెలిచిన ఎంపీలంతా పార్లమెంటులో ప్రస్తావించరా?.. ఏపీకి ఇంత అన్యాయం జరిగినా ఎందుకు మాట్లాడరని నిలదీశారు.