కేంద్ర ప్రభుత్వం, విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ ప్రైవేటీకరణకు సిద్ధమవుతున్న సందర్భంగా, దానికి వ్యతిరేకంగా రాష్ట్రంలోని అన్ని పార్టీల నేతలు కలిసి ఏర్పాటు చేసిన రౌండ్ టేబుల్ సమావేశంలో గందరగోళం నెలకొంది. ఈ అంశంపై ప్రధాన మంత్రి నరేంద్రమోదీని కలిసే విషయంలో నేతల మధ్య వాగ్వివాదం చోటు చేసుకుంది. సీపీఐ రామకృష్ణ, వైసీపీ నేత గౌతంరెడ్డి మధ్య వాదోపవాదాలు జరిగాయి. సీఎం హోదాలో జగన్‌మోహన్ రెడ్డి ప్రధానిని కలిసేలా బాధ్యత తీసుకోవాలని టీడీపీ నేత దేవినేని ఉమ అన్నారు. గతంలో వాజపేయి హయాంలో చంద్రబాబు ఇలాగే ప్రైవేటీకరణ అడ్డుకున్నారన్న విషయాన్ని ఉమ గుర్తుచేశారు. ఇప్పుడు జగన్‌మోహన్ రెడ్డి కూడా ఇలాగే బాధ్యత తీసుకోవాలని దేవినేని, రామకృష్ణ డిమాండ్ చేశారు.