ఈ ఏడాది తొలి సూర్య గ్రహణం ఏప్రిల్ 20న ఏర్పడబోతోంది. దీని ప్రభావం భారత్ లో కనిపించదు. అయితే, ఈ సమయంలో గర్భిణీలు జాగ్రత్తగా ఉండాలని పండితులు పేర్కొంటున్నారు. ఈ సమయంలో అతినీలలోహిత కిరణాలు గర్భిణీలపై పడితే గర్భస్థ శిశువుపై ప్రభావం ఉంటుందంటున్నారు. అందుకే వారు బయటకు రాకూడదు. ఆ టైంలో తినడం, నిద్రపోవడం మంచిది కాదు. సూదులు, కత్తులు, పదునైన వస్తువులు గర్భిణీలు ఉపయోగించకూడదు.