నేపాల్‌కు కొత్తగా ఎన్నికైన అధ్యక్షుడు రామ్ చంద్ర పౌడెల్ తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ఆయనకు ఖఠ్మండూలోని మహారాజ్‌గంజ్‌లో ఉన్న త్రిభువన్ యూనివర్సిటీ టీచింగ్ హాస్పిటల్లో చికిత్స అందిస్తున్నారు. కడుపునొప్పితో బాధపడుతున్నారని వైద్యులు తెలిపారు. ప్రస్తుతం డాక్టర్ల పర్యవేక్షణలో ఉన్నారని ప్రెసిడెంట్ ప్రిన్సిపల్ అడ్వైజర్ సురేశ్ ఛాలిసే చెప్పారు. పౌడెల్ ఈ ఏడాది మార్చి 10న అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు.