సకాలంలో ఉద్యోగులకి జీతాలు ఇవ్వకపోవడం, పెండింగ్ బకాయిలు చెల్లించకపోవడంపై ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం అధ్యక్షులు కేఆర్ సూర్యనారాయణ రాష్ట్ర గవర్నర్‌ను కలిసి ఫిర్యాదు చేశారు. దీంతో ఆగ్రహానికి గురైన ప్రభుత్వం ఆయన నేతృత్వంలోని ప్రభుత్వ ఉద్యోగుల సంఘం గుర్తింపును రద్దు చేయాలంటూ నోటీసులు జారీ చేసింది. ఈ నోటీసులపై కేఆర్ సూర్యనారాయణ హైకోర్టుకు వెళ్లి స్టే తెచ్చుకున్న విషయం తెలిసిందే. ఇప్పుడు తాజాగా వాణిజ్య పన్నుల శాఖ బదిలీలలో జరిగిన అక్రమాలను ప్రశ్నించడం, నిరసన తెలియజేయడాన్ని తట్టుకోలేని ప్రభుత్వం నోటీసులు జారీ చేసింది. ఐతే వాణిజ్య పన్నుల శాఖ ఉద్యోగుల సంఘానికి కూడా కేఆర్ సూర్యనారాయణ అధ్యక్షునిగా ఉండటం గమనార్హం.