వైసీపీ ప్రభుత్వంపై మాజీ సీఎం చంద్రబాబునాయడు మండిపడ్డారు. వైజాగ్‌లోని అబ్దుల్ కలాం వ్యూ పాయింట్‌ని వైఎస్ఆర్ వ్యూ పాయింట్‌గా మార్చడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనికి సంబంధించిన వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేశారు. పేర్లు మారుస్తూ సీఎం జగన్ శాడిజం చూపిస్తున్నారన్నారు. ఇది నిజాయితీ, క్రమశిక్షణ, పట్టుదలకు ప్రతీకగా నిలిచిన అత్యంత ప్రియమైన ప్రజల అధ్యక్షుడిని అగౌరవపరచడం తప్ప మరొకటి కాదు అంటూ రాసుకొచ్చారు.