రాప్తాడు మండల కేంద్రము లోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ను అనంతపురం జిల్లా కలెక్టర్ గౌతమి బుధవారం మధ్యాహ్నం ఆకస్మికంగా తనిఖీ చేశారు. రోగులకు అందుతున్న వైద్య సేవలను ఆమె పరిశీలించారు. మందుల నిలవ, ఓ. పి సేవలు, సిబ్బంది హాజరు తదితర రిజిస్టర్ లు కలెక్టర్ పరిశీలించారు. ప్రభుత్వం వైద్య రంగానికి అధిక ప్రాధాన్యత ఇస్తోందని కాబట్టి జవాబు దారీ తనంతో పనిచేయాలని సూచించారు. కార్యక్రమంలో ఆర్డీవో మధు సూధన్ పాల్గొన్నారు.