నియోజకవర్గ కేంద్రమైన గజపతినగరంలో వామపక్షాల ఆధ్వర్యంలో ప్రచార బేరి కార్యక్రమం బుధవారం జరిగింది. ఈ సందర్భంగా పట్టణంలో ప్రచార భేరి ప్రదర్శన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా సిపిఐ జిల్లా కార్యదర్శి ఒమ్మి రమణ మాట్లాడుతూ కేంద్రంలోని మోడీ ప్రభుత్వం భారతదేశ ప్రజానీకాన్ని కష్టాలపాలు చేస్తున్నదని ఆరోపించారు. కార్పొరేట్లకు ప్రజల సంపదను అప్పనంగా అప్పగిస్తున్నదని అన్నారు. సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యురాలు వి. లక్ష్మీ మాట్లాడుతూ మోడీ పాలనలో ధరలు పెంచి పెను బారాలు మోపారని ఆరోపించారు. కార్యక్రమంలో ఆర్. ఈశ్వరరావు, ఎస్. నారాయణరావు పి. సూర్యనారాయణ, పి. శ్రీను, పి. అప్పలనాయుడు, పాపారావు తదితరులు పాల్గొన్నారు.