స్టాక్ మార్కెట్లు వరుసగా మూడో రోజు నష్టాల్లో ముగిసాయి. ఈరోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 159 పాయింట్లు నష్టపోయి 59,567 వద్దకు చేరుకుంది. నిఫ్టీ 41 పాయింట్లు నష్టపోయి 17,618 వద్ద నిలిచింది.
బీఎస్ఈ సెన్సెక్స్ టాప్ గెయినర్లు : యాక్సిస్ బ్యాంక్ (1.05%), మహీంద్రా అండ్ మహీంద్రా (0.90%), భారతీ ఎయిర్‌టెల్ (0.77%), హెచ్‌డిఎఫ్‌సి లిమిటెడ్ (0.71%), హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ (0.65%).
టాప్ లూజర్స్ : హెచ్సీఎల్ టెక్నాలజీస్ (-2.40%), ఇండస్ ఇండ్ బ్యాంక్ (-2.35%), ఇన్ఫోసిస్ (-2.28%), విప్రో (-1.80%), ఎన్టీపీసీ (-1.71%).