వైఎస్ వివేకా హత్య కేసులో అప్రూవర్ గా మారిన దస్తగిరి సంచలన ఆరోపణలు చేశారు. సీఎం జగన్, ఎంపీ అవినాష్‌రెడ్డి తనకు, కుటుంబ సభ్యులకు ప్రాణహాని ఉందని ఆరోపించారు. అవినాష్ రెడ్డి మనుషులు తనను వెంబడిస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ మేరకు కడప ఎస్పీ కార్యాలయంలో ఫిర్యాదు చేశారు. తనకు, తన కుటుంబానికి తగిన రక్షణ కల్పించాలని కోరారు. తనకు ప్రాణహాని ఉందని సీబీఐ ఎస్పీ, రాయలసీమ రేంజ్ డీఐజీకి రిజిస్టర్ పోస్టు ద్వారా వినతి పత్రం అందజేస్తానని తెలిపారు.