కర్ణాటక మాజీ మంత్రి గాలి జనార్దన్ రెడ్డి సొంతంగా కల్యాణ రాజ్య ప్రగతి పక్ష పార్టీని స్థాపించారు. రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో కూడా ఆయన పార్టీ పోటీ చేస్తోంది. మరోవైపు అక్రమ మైనింగ్ కేసులో నిందితుడిగా బెయిల్‌పై బయట ఉన్నాడు. కానీ బళ్లారి వెళ్లకూడదని బెయిల్ షరతు విధించారు. ఈ నేపథ్యంలో తన బెయిల్ షరతులను సడలించాలని సుప్రీంకోర్టును ఆశ్రయించారు. బళ్లారి వెళ్లేందుకు అనుమతించాలని సుప్రీంకోర్టును కోరారు. ఈ పిటిషన్‌ను విచారించిన సుప్రీంకోర్టు బెయిల్ షరతులను సడలించలేమని స్పష్టం చేసింది. అక్రమ మైనింగ్ కేసులో జనార్దన్ రెడ్డితో పాటు మరో 9 మందిపై సీబీఐ కేసులు నమోదు చేసింది.