ట్రెండింగ్
Epaper    English    தமிழ்

సిగ్నల్ ఓవర్‌షూట్ కారణంగా ,,మధ్యప్రదేశ్‌లో రైలు ప్రమాదం

national |  Suryaa Desk  | Published : Wed, Apr 19, 2023, 10:47 PM

మధ్యప్రదేశ్ రాష్ట్రం షాడోల్ వద్ద ఆగి ఉన్న గూడ్స్ రైలును ఢీకొట్టి.. మరో రైలు పట్టాలు తప్పింది.. సరుకు రవాణా రైలు పట్టాలు తప్పడంతో ఇద్దరు లోకోమోటివ్ పైలట్‌లతో సహా.. ఆరుగురు రైల్వే సిబ్బంది గాయపడినట్లు అధికారులు వెల్లడించారు. ఈ ఘటన కారణంగా.. బిలాస్‌పూర్-కట్నీ మార్గంలో ట్రాఫిక్‌కు అంతరాయం కలిగింది. బిలాస్‌పూర్ రైల్వే డివిజన్ పరిధిలోని సింగ్‌పూర్ స్టేషన్ సమీపంలో.. ఉదయం 6:50 గంటలకు సిగ్నల్ ఓవర్‌షూట్ అయ్యింది. ఈ కారణంగా రైలు ప్రమాదం జరిగిందని సౌత్ ఈస్ట్ సెంట్రల్ రైల్వే అధికారి ఒకరు చెప్పారు. దీంతో ఈ మార్గంలో నడిచే 10 రైళ్లను రద్దు చేసినట్లు ఆయన వివరించారు. ఇనుప ఖనిజంతో వెళ్తున్న గూడ్స్ రైలుకు చెందిన ఎనిమిది వ్యాగన్‌లు, ఒక ఇంజన్ పట్టాలు తప్పాయని చెప్పారు.


ఈ ప్రమాదంలో గాయపడిన వారిని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నట్టు అధికారులు వెల్లడించారు. రైళ్ల రాకపోకలను పునరుద్ధరించడానికి ప్రయత్నాలు కొనసాగుతున్నాయని.. ఘటనా స్థలంలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయని రైల్వే అధికారులు వెల్లడించారు.







SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa