ఎన్నికల వాగ్దానాలకు తిలోదకాలిచ్చి ప్రభుత్వ రంగ సంస్థలను తెగనమ్ముతూ, ప్రజల మధ్య వైశమ్యాలను రెచ్చగొట్టి, దేశ సమైక్యత సమగ్రతకు తూట్లు పొడుస్తున్న బిజెపి, మద్దతిస్తున్న వైసీపీ లను రాబోయే ఎన్నికల్లో గద్దె దించాలని సిపిఐ జిల్లా కార్యదర్శి గాలి చంద్ర పిలుపునిచ్చారు. గురువారం స్థానిక ఒంటిమిట్టలో గోడపత్రాలను విడుదల చేశారు.
ఆయన మాట్లాడుతూ నల్లధనం వెలుగుతీత, రైతు ఆదాయం రెట్టింపు, పేదరిక నిర్మూలన, ఏడాదికి కోటి ఉద్యోగాల కల్పన, ధరల స్థిరీకరణ, దేశ సమైక్యత సమగ్రాభివృద్ధి సాధించడంలో బిజెపి ఘోరంగా విఫలమైందన్నారు. ఈ కార్యక్రమంలో ఏఐఎస్ఎఫ్ జిల్లా కార్యదర్శి జి వరరాజు, సిపిఐ మండల కార్యదర్శి కట్టా యానాదయ్య, సుబ్బరాయుడు, పలుకూరి దత్తాత్రేయ, శేఖర్ రెడ్డి, కట్టా శేఖర్, కట్టా సుధాకర్, సంజీవరెడ్డి, జీవయ్య, చెరువుపల్లి చిన్నయ్య, బాబు, ప్రతాప్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.