విజయనగరం జిల్లా కేంద్రంలో సంచలనం రేకిత్తించిన ఆలీజాన్ (33) హత్యకేసు మిస్టరీని పోలీసులు ఛేదించారు. బార్‌లో జరిగిన ఓ గొడవపై మాట్లాడుదామని అతన్ని పిలిచి మట్టుబెట్టారు. ఈ కేసులో నలుగురు నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. ఈ వివరాలను బుధవారం టూటౌన్ పోలీస్ స్టేషన్‌లో విజయనగరం ఇన్‌చార్జి డీఎస్పీ ఆర్.శ్రీనివాసరావు విలేఖరులకు వెల్లడించారు. దాసన్నపేట పరిధి రింగురోడ్డు సమీపంలో ఆలీజాన్ తన కుటుం బంతో నివాసం ఉంటున్నాడు. ఈ నెల 15న అతడి అనుచరుడు లచ్చన్న రింగు రోడ్డులో ఉన్న ఓ బార్ అండ్ రెస్టారెంట్‌కు వెళ్లి మద్యం తాగాడు. ఈ క్రమంలో బార్ నిర్వాహకుడు తోటపాలెం ప్రాంతానికి చెందిన గేదెల సన్యాసినాయుడుతో ఘర్షణ చోటుచేసుకుంది. ఆ సమయంలో లచ్చన్న తలపై తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రుడిని చికిత్స నిమిత్తం నగరంలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. ఈ విషయం తెలుసుకున్న ఆలీజాన్.. బార్ వద్దకు చేరుకుని నిర్వాహకుడితో గొడ వపడ్డాడు. అనంతరం ఇంటికి వెళ్లిపోయాడు. దీంతో సన్యాసినాయుడు.. బోయి వీధికి చెందిన పొంతపల్లి సురేష్, రౌతువీధికి చెందిన పడాల సంతోష్‌కుమార్, కొత్తపేట గొల్లవీధికి చెందిన పొంతపల్లి శివలను బార్‌కు పిలిపించి జ రిగిన విషయాన్ని చెప్పాడు. వారితో చర్చించి ఆలీజాన్‌ను అంతమొందించాలని నిర్ధారిం చుకున్నారు. పథకంలో భాగంగా ఈ నెల 15న రాత్రి ఆలీజాన్‌కు ఫోన్ చేసి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న లచ్చన్న వద్దకు రావాలని, లచ్చన్న గురించి మాట్లాడదామని చెప్పారు. ఇది నమ్మిన ఆలీజాన్ రాత్రి ఒంటి గంట సమయంలో తన ఇంటికి వచ్చిన సురేష్ వెంట మోటారు సైకిల్‌పై ఆ ఆసుపత్రికి వెళ్లాడు. అక్కడ చర్చించుకున్న అనంతరం మద్యం తాగుదామని చెప్పి ధర్మపురి గ్రామ శివారుకు చేరుకున్నారు. అక్కడ ఫూటుగా తాగారు. ఆ సమయంలో ఆలీజాన్‌తో సురేష్ ఘర్షణకు దిగాడు. ఈ క్రమంలో మద్యం సీసాతో ఆలీజాన్ తలపై గట్టిగా మోదాడు. అనంతరం పగిలిన సీసాతో అతడి గొంతుకోశాడు. దీనికి పడాల సంతోష్‌కుమార్, పొంతపల్లి శివ సహకరించారు. మృతదేహాన్ని అక్కడి నుంచి ఐనాడ జంక్షన్ సత్యానారాయణపురం మీదుగా విశాఖ జిల్లా పద్మనాభ మండలం లింగన్నపేట గ్రామ శివారులోని జీడి తోటలోకి తీసుకెళ్లి కొమ్మలు, ఆకులతో కప్పేశారు. అప్పటికే తెల్లవారడంతో మద్ది గ్రామం వెళ్లి మృతదేహాన్ని పూడ్చేందు కు గునపం, పారా, ఉప్పు కొనుగోలు చేసి తీసుకొచ్చారు. ఆ సమయానికి బార్ నిర్వాహుకుడు సన్యాసినాయుడు ఆక్కడికి చేరుకున్నారు. ఈ క్రమంలో ఆలీజాన్ సమాచారం కోసం అతడి అనుచరులు సన్యాసినాయుడుకు ఫోన్లు చేశారు. దీంతో ఎవరికీ అనుమానం రాకుండా ఉండేందుకు నిందితులంతా టౌన్‌లోకి చేరుకు న్నారు. మృతదేహాన్ని పూడ్చేందుకు వీలుపడకపోవడంతో సమీపంలోని బంకు నుంచి పెట్రోల్ తీసుకొచ్చి మృతదేహాన్ని కాల్చేసి పరారయ్యారు. 16వ తేదీన ఆలీజాన్ భార్య.. తన భర్త కనిపించడం లేదంటూ టూటౌన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు మిస్సింగ్ కేసుగా నమెదుచేసి సెల్‌ఫోన్ ఆధారంగా నిందితుల ను గుర్తించారు. నిందితులను అదుపులోకి తీసుకుని విచారించగా హత్యచేసినట్టు అంగీకరించారు. పోలీసులకు ఘటనా స్థలాన్ని చూపించారు. వారి నుంచి హత్య కు ఉపయోగించిన సీసాను, పూడ్చేందుకు తెచ్చిన వస్తువులు, ఓ కారును స్వాధీనం చేసుకున్నారు. హత్యకేసుగా నమోదు చేసి నిందితులను రిమాండ్‌కు తరలించినట్టు డీఎస్పీ శ్రీనివాసరావు తెలిపారు. సమావేశంలో సీఐ లక్షణరావు. ఎస్‌ఐ షేక్‌శంకర్, ఏఎస్‌ఐ పైడితల్లి సిబ్బంది పాల్గొన్నారు.