కడప జిల్లా, చెన్నూరు మండల పరిధిలో అసాంఘిక కార్యకలాపాలైన దొంగతనాలు, నాటుసారా, అక్రమ మద్యం నిషేధిత గుట్కాలపై దాడులు ముమ్మరం చేయాలని ఎస్పీ కేకేఎన్ అన్బురాజన్ రూరల్ సీఐ అశోక్‌రెడ్డి, ఎస్ఐ శ్రీనివాసులరెడ్డికి సూచించారు. చెన్నూరు పోలీసుస్టేషన్‌ను బుధవారం ఎస్పీ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా స్టేషన్లో రికార్డులను పరిశీలించారు. విచారణలో ఉన్న పాత పెండింగు కేసులను త్వరగా పూర్తి చేయాలని సూచించారు. రోడ్డు ప్రమాదాల నియంత్రణకు చర్యలు తీసుకోవాలని వాహనదారులు, ప్రజలకు అవగాహన కార్యక్రమాలు చేపట్టాలని తెలిపారు. మహిళల భద్రతకు పోలీసుశాఖ ప్రత్యేకంగా రూపొందించిన దిశ యాప్‌పై అవగాహన కల్పించి డౌన్లోడ్ చేసుకోవడంతో పాటు రిజిస్టరు, యూజర్‌గా నమోదు చేసుకునేలా వారిలో చైతన్యం తీసుకురావాలని ఆదేశించారు. పోలీసుస్టేషన్లో ఉన్న వివిధ కేసుల్లో పట్టుబడిన వాహనాలను పరిశీలించారు. దొంగతనాలు అరికట్టేందుకు గస్తీ పెంచాలన్నారు. ఉమెన్హెల్ప్ డెస్క్ రిసెప్షన్‌ను పరిశీలించి అక్కడ మహిళా పోలీసు సిబ్బందితో మాట్లాడారు. అలాగే పోలీసుస్టేషన్ ఆవరణ పరిశుభ్రంగా ఉంచుకోవాలని సూచనలు చేశారు.