విశాఖ స్టీల్ ప్లాంట్ బిడ్డింగ్ గడువు నేటితో ముగిసింది. మొత్తం 29 కంపెనీలు ఆసక్తి చూపినట్లు తెలుస్తోంది. దీనిపై కార్మిక నేత అయోధ్యరాం స్పందించారు. ఏడు విదేశీ కంపెనీలు ఈఓఐ దాఖలు చేసినట్లు వెల్లడైంది. విశాఖ స్టీల్ ప్లాంట్ బిడ్డింగ్ పై ఏపీ, తెలంగాణ ప్రభుత్వాలు ఆసక్తి చూపినట్లు సమాచారం లేదన్నారు. ఎన్ఎన్డిసి వంటి కేంద్ర ఏజెన్సీలు కూడా ఇఓఐని దాఖలు చేయలేదని అయోధ్యరామ్ పేర్కొన్నారు.కాగా, విశాఖ ఉక్కు పరిశ్రమ ఈవో నేపథ్యంలో సీబీఐ మాజీ జేడీ వీవీ లక్ష్మీనారాయణ కూడా బిడ్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే.