సీఎం జగన్, వైసీపీ ప్రభుత్వంపై తెలుగుదేశం సీనియర్ నేత, మాజీ ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు విమర్శలు గుప్పించారు. సెప్టెంబర్‌లోగా విశాఖకు వెళ్లిపోతానంటూ ముఖ్యమంత్రి జగన్ ప్రకటించడంపై మండిపడ్డారు. ఫిరాయింపు రాజకీయాలలో భాగంగానే విశాఖలో కాంపురం పెట్టాలని జగన్ ప్లాన్ చేస్తున్నారని విమర్శించారు. విశాఖ రాజధాని మాటున 40 వేల కోట్లు దోచుకున్నారు. పథకాల పేరుతో భారీ అవినీతికి పాల్పడ్డారని ధ్వజమెత్తారు.రాష్ట్రానికి పెట్టుబడులు వస్తాయని మంత్రులు ఆర్భాటంగా ప్రకటనలు చేశారని, నిధులు లేక పథకాలు నిలిచిపోయాయని సీఎస్ చెప్పారని యనమల వెల్లడించారు.