ఆంధ్రప్రదేశ్‌లో ఖాళీగా ఉన్న అంగన్‌వాడీ వర్కర్లు, హెల్పర్ల పోస్టులను వెంటనే భర్తీ చేయాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఉత్తర్వులు జారీ చేశారు. మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ అధికారులతో గురువారం ఆయన సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ శాఖలోని ఖాళీలను భర్తీ చేయాలని సూచించారు. అంగన్ వాడీ కేంద్రాల్లో పిల్లల ఎదుగుదలను పర్యవేక్షించే పరికరాలు అందుబాటులో ఉండేలా చూడాలన్నారు. గ్రోత్ మానిటరింగ్ పరికరాలను వెంటనే ఏర్పాటు చేయాలని సూచించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa