21-04-2023 సాయంత్రం 5. 30 గం. లకు 61 కార్పొరేటర్ శ్రీమతి కొణతాల సుధా, 62 వ వార్డు కార్పొరేటర్ బల్ల లక్ష్మణరావు వారు ఆధ్వర్యంలో స్థానిక డ్వాక్రా సంఘాల మహిళలతో మల్కాపురం మరిడిమాంబ కళ్యాణ మండపం సమావేశంలో మాట్లాడుతూ జగనన్న ప్రభుత్వంలో మహిళలకు ఆర్థికంగా సామాజికంగా అగ్ర తాంబూలం ఇస్తుందని తెలియజేసి, ప్రియతమ ముఖ్యమంత్రివర్యులు జగన్మోహన్ రెడ్డి పాదయాత్రలో భాగంగా నవరత్న పథకాల్లో చాలా వరకు మహిళలకు పెద్దపీట వేయడం జరుగుతుందని, మాట తప్పకుండా మడమ తిప్పకుండా, కరోనా కష్టకాలంలో కూడా డ్వాక్రా రుణమాఫీని, అమ్మ ఒడి, చేయూత, నవ శకం , జగనన్న తోడు వంటి ఎన్నో పథకాలను జగన్మోహన్ రెడ్డి మహిళా పక్షపాతిగా అక్క చెల్లెమ్మలకు దేశంలో ఎక్కడా లేని సంక్షేమ అభివృద్ధి పథకాలు మన రాష్ట్రంలో అమలపరచడం జరిగింది.
కావున మహిళలందరూ రాబోవు సార్వత్రిక ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి తరపున విశాఖ పశ్చిమ నియోజకవర్గం తరఫునుండి ఎమ్మెల్యే అభ్యర్థిగా ఆడారి ఆనంద్ కుమార్ అనే నేను పోటీ చేయుచున్నందున ఆశీర్వదించి గెలిపించాలని అభ్యర్థించారు. అదేవిధంగా ఇంత మంది సీనియర్ నాయకులు, కార్పొరేటర్లు, నాయకులు కార్యకర్తలు మహిళలు మధ్యలో నా వివాహ వార్షికోత్సవం జరుపుకోవడం చాలా ఆనందంగా ఉందని మీరు చూపే ప్రేమ, ఆభిమానం, ఆప్యాయత, జీవితాంతం నాపైన ఉండాలని కోరుకుంటూ మీ కుటుంబ సభ్యులా మీ కష్టసుఖాల్లో నేను ఉంటానని ఆనంద్ భరోసా ఇచ్చి మీ ఆశీస్సులు, తోడ్పాటు అందించాలని కోరుకున్నారు.ఏటీఆర్ ట్రస్ట్ ఆడారి తులసీరావ్ ట్రస్ట్ ద్వారా 50 మందికి ఉచితంగా కంటి ఆపరేషన్ చేయించి తదుపరి వారికి కళ్లద్దాలను పంపిణీ చేయడం జరిగిందివిశాఖ పశ్చిమ నియోజకవర్గం సమన్వయకర్త ఆడారి ఆనంద్ కుమార్ వివాహ వార్షికోత్సవ దినోత్సవాన్ని పురస్కరించుకొని భారీ కేక్ కట్ చేసి ఇలాంటి వివాహ వార్షికోత్సవాలు మరెన్నో నిండు నూరేళ్లు ఆయురారోగ్య ఐశ్వర్యాలతో జరుపుకోవాలని మనస్ఫూర్తిగా హాజరైన అతిధులు మహిళలు కార్యకర్తలు నాయకులు కోరుకోవడం జరిగింది.
ఈ కార్యక్రమంలో వైయస్సార్ టియుసి జిల్లా అధ్యక్షులు కలిదిండి బద్రీనాథ్ , స్టాండింగ్ కమిటీ సభ్యులు కార్పొరేటర్ పివి సురేష్ , కార్పొరేటర్లు కొణతాల సుధా , బల్ల లక్ష్మణరావు , గుండపు నాగేశ్వరరావు , మార్కెట్ కమిటీ చైర్మన్ ఆల్ఫా కృష్ణ డైరెక్టర్ టి. వి. రమణి, స్థానిక నాయకులు శ్రీ బోగవల్లి నాగభూషణం , దాడి సత్యనారాయణ , మల్కాపురం సర్కిల్ ఇన్స్పెక్టర్ లోధర్ బాబు, కొల్లి నూక రెడ్డి , జి. ఎల్. వి. నరేష్ , ఆడారి హరీష్, నేవి అనిల్, కే. సంతోష్ 90 వార్డు సీనియర్ నాయకులు నమ్మి శ్రీను , టి సంపత్ కుమార్, సచివాలయ కన్వీనర్లు చట్టి నూకరాజు, బూషా అప్పల రెడ్డి, స్వప్న, పండు, రామకృష్ణ, సూర్యనారాయణ గృహ సారథులు, స్థానిక నాయకులు సచివాలయ సిబ్బంది , ఆర్పీలు, వాలంటీర్లు , యువత, మహిళలు నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.