ఉక్రెయిన్ పై రష్యా ఆర్మీ బాంబులు, మిస్సైళ్లతో విరుచుకుపడుతోంది. ఇందులో భాగంగా గురువారం రాత్రి రష్యా యుద్ధ విమానం పైలట్ ఒకరు పొరపాటున ఉక్రెయిన్ నగరమని బెల్గరోడ్ పై బాంబు దాడి చేశాడు. ఈ ఘటనలో ముగ్గురు పౌరులు గాయపడగా, పలు వాహనాలు ధ్వంసమయ్యాయి. ఈ నగరం ఉక్రెయిన్ సరిహద్దుకు దాదాపు 40 కి.మీ దూరంలో ఉంది. తొలుత ఇది ఉక్రెయిన్ పనేనని భావించిన అధికారులు పొరపాటు గుర్తించి తర్వాత అధికారిక ప్రకటన చేశారు.