వయసుతో సంబంధం లేకుండా దేశవ్యాప్తంగా అనేకమంది గుండెపోటుతో మరణిస్తున్నారు. తాజాగా మహారాష్ట్రలోని పూణేలో 14 ఏళ్ల బాలుడు గుండెపోటుతో ప్రాణాలు కోల్పోయాడు. స్నేహితులతో కలిసి క్రికెట్ ఆడుతున్న వేదాంత్ గుండెపోటుతో ఒక్కసారిగా కుప్పకూలాడు. దీంతో అతడిని ఫ్రెండ్స్ వేదాంత్ కుటుంబీకులకు సమాచారమిచ్చారు. వారు హుటాహుటిన బాలుడిని ఆస్పత్రికి తీసుకెళ్లగా చికిత్స పొందుతూ చనిపోయాడు.