దేశంలో మతోన్మాద బీజేపీ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైసిపి అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాల పై సిపిఐ, సీపీఎం వామపక్ష పార్టీల ఆల్ ఇండియా కమిటీల పిలుపు మేరకు సిపిఐ, సీపీఎం 9 వ రోజు జరిగిన ప్రచారభేరి కార్యక్రమం నిర్వహించారు. సిపిఐ జిల్లా సహాయ కార్యదర్శి బుగత అశోక్, సీపీఎం జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు రెడ్డి శంకర్రావు ల నేతృత్వంలో శనివారం తెల్లవారు జామున విజయనగరం పట్టణంలో గంటస్థంభం, సిటీ బస్టాండ్, న్యూపూర్ణా జంక్షన్, రాజీవ్ స్టేడియం ప్రాంతాల్లో పాదయాత్ర చేస్తూ గ్రామాల్లో నుంచి కాయగూరలు తెచ్చి అమ్ముకుంటున్న రైతులను, తోపుడు బళ్ళ చిరు వ్యాపారులను, స్టేడియంలో క్రీడాకారులను, వాకర్స్ ను కలిసి కరపత్రాలు ద్వారా ప్రచారం చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు ఎస్. రంగరాజు, జిల్లా సమితి సభ్యులు పొందూరు అప్పలరాజు, ఎస్. సునీల్, పట్టణ నాయకులు పొందూరు రాంబాబు, ఎ. రాములు, జె. సుధాకర్, ఎన్. పాపునాయుడు తదితరులు పాల్గొన్నారు.