‘‘సీఎం జగన్ కేసులను మాఫీ చేసుకోవడానికి ఢిల్లీ యాత్ర చేస్తున్నారు. రాష్ట్రానికి రావాల్సిన నిధుల కోసమో, విభజన హక్కుల సాధన కోసమో వెళ్లడం లేదు’’ అని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ స్పష్టం చేశారు. తిరుపతిలో ఆయన మాట్లాడుతూ.. ఆర్థిక నేరగాళ్లకు అధికారిక ప్రతినిధిగా సజ్జల రామకృష్ణారెడ్డి వ్యవహరిస్తున్నారన్నారు. కాగా, శుక్రవారం పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలో వామపక్షాల ప్రచార భేరి యాత్రలో భాగంగా నిర్వహించిన బహిరంగ సభలో సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ మాట్లాడుతూ, జగన్ మూడు రాజధానులంటూ చివరికి రాష్ట్రానికి రాజధాని లేకుండా చేశాడని విమర్శించారు.