‘‘కారుమూరీ నువ్వు కామ్‌గా కూర్చోపోతే కామన్ మ్యాన్ చేతిలో బడిత పూజ ఖాయం’’ అని మాజీ ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న హెచ్చరించారు. ప్రపంచంలో అతిపెద్ద ఆర్థిక ఉగ్రవాది జగన్‌రెడ్డి అని, తండ్రి అధికారంతో రూ.లక్ష కోట్లు, తన అధికారంతో రూ.2 లక్షల కోట్లు దోచాడని దుయ్యబట్టారు. సొంత బాబాయ్‌ని హత్య చేయించిన నీచుడి పక్కనచేరి నోటికి హద్దు లేకుండా మాట్లాడుతున్నాడని మండిపడ్డారు. తల్లినీ, చెల్లెళ్లనే తరిమేసినోడికి ప్రజలో లెక్కా? అని ఎద్దేవా చేశారు.