ముస్లింలకు పవిత్రమైన రంజాన్ పండుగ వేళ 10,000 మంది ఇమామ్‌లు, మౌజన్లను పస్తులుంచిన ఘనత జగన్‌రెడ్డికే దక్కుతుందని టీడీపీ అధికార ప్రతినిధి సయ్యద్ రఫీ ధ్వజమెత్తారు. పండుగనాడు పరమాన్నం తినాల్సిన మత పెద్దలు జగన్ కారణంగా పస్తులుండే పరిస్థితి వచ్చిందని మండిపడ్డారు. తమను మోసం చేసిన జగన్‌రెడ్డిని ముస్లింలు ఎందుకు నమ్మాలి? అని ప్రశ్నించారు.