తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. నేడు (శనివారం) శ్రీవారి సర్వదర్శనానికి భక్తులు 6 కంపార్టుమెంట్లలో వేచి ఉన్నారు. టోకెన్ లేని భక్తులకు శ్రీవారి సర్వదర్వనానికి 12 గంటల సమయం పడుతోంది. ఇక శుక్రవారం శ్రీవారిని దర్శించుకున్న 57,354 మంది భక్తులు దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. నిన్న శ్రీవారి హుండీ ఆదాయం 3.40 కోట్ల రూపాయలు వచ్చినట్టు తిరుమల తిరుపతి దేవస్థానం వెల్లడించింది. 24398 మంది భక్తులు స్వామివారికి తలనీలాలు సమర్పించారు. ఎల్లుండి (మంగళవారం) శ్రీవారి దర్శన టికెట్లను టీటీడీ విడుదల చేయనుంది. మధ్యాహ్నం 3 గంటలకు జూన్ నెలకు సంబంధించిన టికెట్లు ఆన్‌లైన్‌లో విడుదల కానున్నాయి. ఈ నెల 25న రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లను టీటీడీ విడుదల చేయనుంది.