శ్రీకాకుళం జిల్లా, టెక్కలి పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో ప్రతి ఇంటికీ సేవలు అందించాలని విశాఖ రీజియన్ పోస్ట్‌మాస్టర్ జనరల్ వి.రాములు అన్నారు. స్థానిక మెయిన్ రోడ్డులోని తపాలాశాఖ కార్యాలయం ఆవరణలో టెక్కలి, సోంపేట సబ్‌డివిజన్ పరిధిలోని జీడీఎస్, బీపీఎం, సిబ్బందితో సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ.. గ్రామీణ ప్రాంత ప్రజలకు పొదుపు, బీమా, ఆర్డీ, సేవింగ్స్ బ్యాంక్, ఆర్‌పీఎల్‌ఐ (రూరల్ పోస్టల్ లైఫ్ ఇన్సూరెన్స్), ఎంఎస్‌ఎస్‌సీ (మహిళా సమ్మాన్ సేవింగ్స్ సర్టిఫికేట్) తదితర పథకాలపై అవగాహన కలిగించాలన్నారు. సమావేశంలో తపాలాశాఖ జిల్లా సూపరింటెండెంట్ వి.సత్యనారాయణ, ఏఎస్పీ ఇంద్రసేన, పోస్టల్ ఇన్‌స్పెక్టర్ ఎన్.శ్రీకాంత్, టెక్కలి పోస్ట్‌మాస్టర్ భానోజీరావు, బీపీఎంలు పాల్గొన్నారు.