వచ్చే ఎన్నికల్లో కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వాన్ని ఓడించాలని, లేదంటే దేశానికి భవిష్యత్ ఉండదని ఏజీటీయూసీ శ్రీకాకుళం జిల్లా ప్రధాన కార్యదర్శి అనపాన షన్ముఖరావు అన్నారు. పొందూరులో శుక్రవారం సీపీఐ, సీపీఎం జాతీయ కమిటీల పిలుపు మేరకు బీజేపీని ఓడించండి-దేశాన్ని కాపాడండి అంటూ ఇంటింటికీ కరప త్రాలను పంపిణీ చేశారు. దేశసంపదను, ప్రభుత్వ రంగ సంస్థలను, ఆస్తులను కారుచౌ కగా అదానీ, అంబానీలకు కట్టబెడుతూ కార్పొరేట్లకు బీజేపీ ఊడిగం చేస్తోందని విమర్శించారు. రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం కేంద్రప్రభుత్వానికి వంతపాడుతూ గంగవరం పోర్టును, ఇతర ప్రభుత్వ సంస్థలను కార్పొరేట్లకు అందిస్తున్నారని ఆరోపించారు. కార్యక్రమంలో ఆర్.సత్యనారాయణ, పి.ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.