మాజీ ఎంపీ వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు దర్యాప్తులో నేడు వివేకా అల్లుడు రాజశేఖర్ రెడ్డిని సీబీఐ ఈరోజు విచారించింది. సీఆర్పీసీ 160 కింద ఆయనకు మొదట నోటీసులు అందాయి.. దీంతో రాజశేఖర్ రెడ్డి ఈరోజు హైదరాబాద్లోని సీబీఐ కార్యాలయానికి వచ్చారు. వివేకా హత్య స్థలంలో దొరికిన లేఖపై సీబీఐ అధికారులు రాజశేఖర్ రెడ్డిని ప్రశ్నించారు. లేఖను ఎందుకు దాచమని అడిగారో వివరణ ఇవ్వాలని కోరారు. ఇంతలో సీబీఐ విచారణ ముగియడంతో రాజశేఖర్ రెడ్డి ఇంటికి వెళ్లిపోయారు.